సినిమా సందడి అంటేనే సంక్రాంతి.. అందుకే వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్ బాక్సాఫీస్ రింగ్‌లోకి దిగేందుకు రెడీ అవుతుండగా.. ఇప్పుడు బాలయ్య కూడా సై అంటున్నారట. ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.
ఇక ఈ దసరాకు గాడ్ ఫాదర్‌తో హిట్ కొట్టిన చిరు.. సంక్రాంతికి మెగా 154ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి వార్‌లో ఉంటామని అనౌన్స్ కూడా చేశారు. కాకపోతే రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండడంతో.. అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక వీటితో పాటు వంశీ పైడిపల్లి-విజయ్ కాంబోలో వస్తున్న ‘వారసుడు’ కూడా సంక్రాంతికే రిలీజ్ అంటున్నారు.
ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కూడా అదే సమయంలో రావచ్చని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. ముందుగా డిసెంబర్లో రిలీజ్ చేయనున్నారని వినిపించింది. అయితే ఇప్పుడు అసలు కారణాలు తెలియకపోయినా.. సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇదే నిజమైతే ఈ సారి సంక్రాంతి వార్.. మెగా వర్సెస్ నందమూరిగా మారడం పక్కా అని చెప్పొచ్చు.
అయితే ఈ బడా హీరోలు పోటీ పడితే ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ తప్పదు. అందుకే ఎవరో ఒకరు వెనకడుగు వేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ప్రభాస్, చిరు ఫిక్స్ అయ్యారు కాబట్టి.. బాలయ్య 107 రిలీజ్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.