»Sandeep Reddy Vangas Comments That Are Shaking Bollywood Viral
Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను కుదిపేస్తున్న సందీప్ రెడ్డి వంగా కామెంట్స్… వైరల్
యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అంటే తెలియని వారు ఉండరు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో ఎంత పెద్ద రచ్చ చేశాయో చూశాము. అయితే ఆ మాటలపై పలువురు స్టార్స్ స్పందించారు.
Sandeep Reddy Vanga: కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన సందీర్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) యానిమల్(Animal) మూవీతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన తీసింది మూడే సినిమాలు అయినా అందరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా మారిపోయారు. సందీప్ తెరకెక్కించిన చిత్రాలు ఎంత పేరును సంపాదించుకున్నాయో అంతే రేంజ్లో దుమారం రేపాయి. బాలీవుడ్ బడా స్టార్స్, క్రిటిక్స్ సైతం ఆయన సినిమాలపై స్పందించారు. రణబీర్ కపూర్ ప్రాధాన పాత్రలో తెరకెక్కిన యానిమల్ చిత్రంపై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. ఇలాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరం అని పేర్కొన్నారు. తాజాగా సందీప్ ఓ ఇంటర్వ్యూలో జావేద్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూడలేదా, ముందు నీ కుమారిడికి చెప్పండి. తరువాత మిగితా సినిమాల గురించి మాట్లాడండి కౌంటర్ ఇచ్చాడు. ఆ సిరీస్ తాను చూడలేదని, ప్రచారాల్లో వాడిన వీడియో క్లిప్స్ చూస్తేనే వాంతికి వచ్చిందని వెల్లడించారు.
అదే ఇంటర్వూలో కంగనా రనౌత్(Kangana Ranaut) గురించి మాట్లాడారు. నా సినిమాపై కంగనా నెగిటీవ్ రివ్యూ ఇచ్చినా పర్లేదు. ఆమె నటించిన క్వీన్ చిత్రం చాలా బాగా నచ్చింది. నా సినిమాల్లో తనకు సరిపోయే పాత్ర ఉంటే కచ్చితంగా తనకు కూడా కథ చెప్తాను అన్నాడు. దీనిపై కంగనా రిప్లై ఇచ్చింది. నాకు నీ సినిమాల్లో నటించాలని లేదు. నీ కథల్లో నటిస్తే అల్ఫా మగాళ్లుగా ఉన్న నీ హీరోలు ఫెమినిస్టులు అవుతారేమో చూసుకొ అని వ్యాఖ్యానించింది. తరువాత అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలపై సందీప్ స్పందించారు. అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమా ప్రస్థావనపై కిరణ్ రావు మాట్లాడుతు.. నేను యానిమల్ సినిమా ఒక్కదాని గురించే అనలేదు ఇప్పుడొస్తున్న కొన్ని సినిమాలు స్త్రీలను కిించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నట్లు ఆమె వెల్లడించింది. సందీప్ తన సినిమాల గురించే అన్నట్లు ఎందుకు ఊహించుకున్నారో తెలియదు అని కిరణ్ అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ బీటౌన్‌లో గట్టిగా వినిపిస్తుంది.