Samyuktha Menon Will be Confirmed In Guntur kaaram Movie Instead Of Pooja
Guntur kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు (mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (trivikram srinivas) గుంటూరు కారం మూవీపై ట్రోల్స్ ఆగడం లేదు. హీరోయిన్ పూజా హెగ్గే ఔట్ అని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (thaman) కూడా మూవీ నుంచి వైదొలిగాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అబ్బే అదేం లేదని మూవీ టీమ్ చెబుతోన్న.. రూమార్లు మాత్రం తెగ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా పూజా ప్లేస్‌లో మరో హీరోయిన్ను తీసుకున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
పూజా హెగ్డే హ్యాండ్..?
త్రివిక్రమ్ శ్రీనివాస్ (trivikram srinivas) మూవీస్‌లో వరసగా నటిస్తోన్న పూజా హెగ్డే (pooja hegde) గుంటూరు కారం నుంచి తప్పుకుందట. ఇదే వార్త హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. సెకండ్ హీరోయిన్ శ్రీ లీల (sreeleela) అని.. మెయిన్ హీరోయిన్ పూజా ప్లేస్‌లో సంయుక్త మీనన్‌ను (samyukhta) తీసుకున్నారని తెలుస్తోంది. భీమ్లా నాయక్ మూవీతో సంయుక్తను త్రివిక్రమ్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత సార్ మూవీలో అవకాశం ఇచ్చింది. విరూపాక్ష మూవీతో గోల్డెన్ లెగ్ అయ్యింది సంయుక్త. గుంటూరు కారంలో పూజాకు బదులుగా సంయుక్తను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.
శ్రీలీలకు లక్కీ ఛాన్స్
ఒకవేళ ఇదే నిజమైతే.. ఇప్పటివరకు సెకండ్ హీరోయిన్గా ఉన్న శ్రీలీలకు బంపర్ ఆఫర్ వచ్చినట్టే అవుతోంది. ఆమె ఫస్ట్ హీరోయిన్ అవనుండగా.. సంయుక్త మీనన్ సెకండ్ హీరోయిన్ అవుతుందని మరికొందరు అంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మూవీ నుంచి తప్పుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అతని స్థానంలో అనిరుద్ రవిచంద్రన్‌ను తీసుకున్నారట. అదేం లేదని థమన్ అంటున్నారు. ప్రచారం చేస్తున్నవారిపై సెటైర్లు వేశారు.
షూటింగ్ ఆలస్యం
మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో అనుమానాలు వస్తున్నాయి. ఇవన్నీ పుకార్లేనని.. ఈ నెల 24వ తేదీ నుంచి మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నామని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. మేకర్స్ అదేం లేదంటోన్న.. పుకార్ల మాత్రం జోరుగా వస్తున్నాయి. ఏదైమైనా నిప్పు లేనిదే పొగ రాదు కదా..?