సమంత లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘యశోద’.. ఈ వారమే థియేటర్లోకి రానుంది. సరోగసీ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమాతో.. హరి & హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. అయితే సమంత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తు.. ఓ ఇంటర్య్వూలో బోరున ఏడ్చింది సమంత. దాంతో ఆమె అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇదే ఇప్పుడు యశోద సినిమాకు మరింత పబ్లిసిటీతో పాటు సింపథి కూడా ఏర్పడేలా చేసింది. సామ్ కూడా చాలా టెన్షన్ గా ఉందని, ఒక రకంగా ఎగ్జయిటెడ్‌గా ఉన్నానని చెబుతోంది. దాంతో యశోద రిజల్ట్ సామ్‌కు కీలకంగా మారింది. పైగా కొంత గ్యాప్ తర్వాత.. పాన్ ఇండియాలో స్థాయిలో లక్ చెక్ చేసుకునేందుకు రెడీ అవుతోంది.
కానీ యశోద టార్గెట్ భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను నాలుగు కోట్లలో తీయాలని అనుకున్నామని.. కానీ పాన్ ఇండియా పేరుతో 40 కోట్ల బడ్జెట్ పెట్టామని మేకర్స్ చెబుతున్నారు. అంతేకాదు యాభై కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఈ సినిమా బిజినెస్ భారీ మొత్తంలో జరిగితే.. రిస్క్ చేస్తున్నారనే చెప్పొచ్చు. కానీ మొత్తంగా ఈ చిత్రానికి పదిహేను కోట్లకు అటు, ఇటుగా ఖర్చు చేసినట్టు ఇన్సైడ్ టాక్. మొత్తంగా 30 కోట్ల బిజినెస్ జరిగిందట. అయినా కూడా యశోద ముందు భారీ టార్గెట్ ఉందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో సమంత పాన్ ఇండియా స్టార్డమ్ అందుకుంటుందేమో చూడాలి.