»Salman Katrina Dance In The Movie Theater Here Is The Video
Tiger 3′ movie : సినిమా థియేటర్లో సల్మాన్-కత్రినా డ్యాన్స్.. ఇదిగో వీడియో
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్-కత్రినా కూడా ఇలానే ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి ఆడిపాడారు. వీళ్లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘టైగర్-3’. తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ముంబయిలోని థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించింది. అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాలోని ఓ పాటకు హుషారైన స్టెప్పులు వేసి కత్రినా-సల్మాన్ అలరించారు.
మనీష్ శర్మ తెరకెక్కించిన ‘టైగర్ 3’ సినిమా (Tiger 3′ movie) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ (Katrina Kaif) హీరోయిన్గా నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలైన టైగర్ 3 సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.తొలి మూడు రోజులు మంచి వసూళ్లను రాబట్టిన ‘టైగర్ 3’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ 150 కోట్లకు చేరువలో ఉంది. తాజాగా బాలీవుడ్ స్టార్స్ సల్మాన్-కత్రినా కూడా ఇలానే ముంబయిలోని ఓ థియేటర్ (Theater)కు వెళ్లి డ్యాన్స్ చేశారు. వీళ్లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘టైగర్-3’. తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ముంబయి(Mumbai)లోని థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించింది. అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాలోని ఓ పాటకు హుషారైన స్టెప్పులు వేసి కత్రినా-సల్మాన్ అలరించారు.
దీనికి సంబంధించిన వీడియోను యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎక్స్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. ‘నేను యాక్షన్ హీరోగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. ఫ్యాన్స్ నాపై ఇంత అభిమానం చూపించడం అదృష్టంగా భావిస్తున్నా. ‘టైగర్-3’ విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి జానర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన పని కాదు. యాక్షన్ మూవీల్లోను కొత్తదనాన్ని ఆవిష్కరించాలి. ఇది హ్యాట్రిక్ విజయంతో సమానం. దీని కోసం ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ దృష్టిపెట్టాను’ అని అన్నారు. ఇక ఈ సినిమా ఐదురోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. సగటు సినీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా సల్మాన్ ఖాన్ (Salman Khan) అభిమానులకు మాత్రం ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాగా నచ్చేసింది. దీంతో సల్లూ భాయ్ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి.
తొలి మూడు రోజులు మంచి వసూళ్లను రాబట్టిన ‘టైగర్ 3 రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సల్మాన్‌ఖాన్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అదే టైగర్ 3 వసూళ్ల వర్షానికి కారణమంటున్నారు. ‘టైగర్ 3’కి తొలిరోజే భారీ ఓపెనింగ్ వచ్చింది. నవంబర్ 12న ఈ సినిమా 44.50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.59 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక మూడో రోజు వసూళ్లు రూ.42.50 కోట్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు (Trade experts) చెబుతున్నారు. మొత్తంగా మూడు రోజుల్లోనే 145 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన టైగర్ 3 రూ.150 కోట్ల మార్కును అందుకునేందుకు చేరువలో ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రూ. 200 కోట్లకు చేరువలో సల్మాన్ మూవీ ఉందని తెలుస్తోంది.