రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సలార్ మూవీ. రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ టీజర్.. డిజిటల్ రికార్డ్స్‌లో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే బిజినెస్ పరంగా సలార్ మూవీకి గట్టి పోటీ ఉంది. అందుకే.. రిలీజ్‌కు రెండు నెలల సమయం ఉండగానే.. బుక్ మై షోలో 200కెతో సెన్సేషన్ క్రియేట్ చేసింది సలార్.
జూలై 28 నుంచి సెప్టెంబర్ 28 వరకు సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. అయినా కూడా రెండు లక్షల మంది ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు. అసలు ప్రభాస్ కటౌట్‌కు సరైన మాస్ బొమ్మ పడితే ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు వచ్చిన మాస్ సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. సలార్ ఒక ఎత్తు అనేలా రాబోతోంది. కెజియఫ్ తర్వాత సలార్‌ను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్.
రీసెంట్గా వచ్చిన టీజర్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత సలార్ ఓ బ్రాండ్‌గా నిలుస్తుందని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా కోసం ఇండియన్ ఆడియెన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలని చెప్పొచ్చు. లేటెస్ట్గా బుక్ మై షోలో సలార్ కోసం ఏకంగా 2 లక్షల మందికి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అప్పుడెప్పుడో లక్షకి పైగా ఇంట్రెస్ట్స్ రిజిస్టర్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్.. ఇప్పుడు 2 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ని రిజిస్టర్ చేసి మరో రికార్డు సెట్ చేసింది. రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే ఇలా ఉంటే.. ఇక మున్ముందు సలార్ క్రేజ్ ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో లాస్ అయిన సినిమా బయ్యర్లు.. సలార్‌తో లెక్కలు సరిచేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సలార్ తెలుగు రైట్స్ కోసం గట్టి పోటీ ఉంది. మరి ఇంత హైప్ ఉన్న సలార్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.