టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఇటీవల శాకుంతలం సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆ మూవీ ఆశించిన ఫలితం అందించలేదు. మూవీలోని పూర్ గ్రాఫిక్స్, సరిగా ఎమోషన్స్ పండకపోవడం వల్ల మూవీ రిజల్ట్ బోల్తా కొట్టింది. తర్వాత ఖుషీ, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం సమంత(Samantha) మూవీలకు బ్రేక్ ఇవ్వడంతో, తనకు నచ్చిన పనులు చేసుకుంటూ ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. మొన్నటి వరకు ఆధ్యాత్మిక మార్గంలో పయనించిన ఆమె, ప్రస్తుతం ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో రెండు వీడియోలు(Video Viral) షేర్ చేసింది. అందులో ఆమె చేసిన విన్యాసాలు చూస్తుంటే, మైండ్ డ్లాక్ అయిపోతుంది.
మరో అమ్మాయితో కలిసి ఓ ఫీట్ చేసింది. తన కాళ్లపై మరో అమ్మాయిని లేపింది. చాలా సింపుల్ గా చేసేసింది. దానికి ఇది మా పార్టీ అంటూ క్యాప్షన్ పెట్టారు. మరో అమ్మాయిని కూడా ఆమె ట్యాగ్ చేశారు. పార్టీ అంటే ఇదా అని అందరూ షాకౌతున్నారు. కాగా, మామూలుగానే సమంత(Samantha)కు ఫిట్నెస్ మీద ఫోకస్ ఎక్కువ. ఎప్పటికప్పుడు చాలా కష్టమైన వ్యాయామాలు చేస్తూ ఉంటుంది. ఇక, ఇప్పుడు ఆమెకు ఫ్రీ టైమ్ కూడా దొరకడంతో ఇప్పుడు మరింత ఎక్కువ కసరత్తులు చేస్తుండటం విశేషం. కాగా కొత్త సినిమా ఏదీ చేయకపోయినా, ఆమె వీటి ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.