సలార్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన చిత్ర యునిట్.. ఆ తేదీనే ఫైనల్ అన్న దర్శకుడు. ప్రభాస్ అభిమానులు రెడీగా ఉండాలని పిలుపు. గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని క్లారిటీ..
ప్రభాస్ ( Prabhas ) హీరోగా ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సలార్’ ( Salaar). భారీ యాక్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే సలార్ విడుదలపై పలు పుకార్లు శికార్లు కొడుతున్నాయి. విడుదల జాప్యం అవుతుందని అనుకున్న తేదీలో విడుదల కాదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పలువురు ప్రభాస్ అభిమానులు చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ విడుదల విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. చిత్ర యునిట్ కూడా ఈ విషయం గురించి అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ‘సలార్’ అనుకున్న సమయానికే విడుదల అవుతుంది. అభిమానులెవరూ ఈ విషయంపై చింతించకండి అంటూ చిత్ర యునిట్ స్పష్టం చేసింది. సుప్టెంబర్ 28 న సినిమాను అందరూ థియేటర్లలో చేడవచ్చని తెలిపింది.
‘ప్రభాస్ అభిమానులూ, సినీ ప్రియుడు సిద్దంగా ఉండండి. ఎప్పటికీ ఈ సినిమా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సినిమాను ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి’ అని చిత్ర యునిట్ ట్వీట్ చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులకు రెక్కలు వచ్చినంత పనైంది. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా రెండు పార్ట్ లు గా రానుందని తెలుస్తోంది. కన్నడ నటుడు దేవరాజ్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ… తన పాత్ర మొదటి బాగం కన్నా రెండో పార్ట్ లోనే అధిక ప్రాధాన్యత ఉందని చెప్పారు. దీంతో ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని స్పష్టం అయింది.
ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రుతి హసన్ నటిస్తోంది. పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది.