Salaar: డార్లింగ్ ప్రభాస్ సలార్ (Salaar) మూవీ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించడం… యాక్షన్ సన్నివేశాలకు కొదవలేదని చెప్పడం.. ప్రభాస్ డ్యుయల్ రోల్ అని లీక్స్ రావడంతో సినిమా మిస్ కావొద్దని డార్లింగ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫ్యాన్స్ సెప్టెంబర్ 28వ తేదీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఓవర్సీస్లో అయితే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.
అమెరికాలో సలార్ మూవీ (Salaar) అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఇప్పటికే టికెట్లు అమ్ముడు పోయాయట. టికెట్స్ సేల్ అనే పోస్టర్లను ఫాన్స్ షేర్ చేస్తున్నారు. సో.. ఓవర్సీస్లో సలార్ క్రేజ్ మాములుగా లేదు. బాహుబలి తర్వాత డార్లింగ్ చేసిన.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీస్ నిరాశ పరిచాయి. కలెక్షన్స్ వచ్చిప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్ పడలేదు. ఇప్పుడు సలార్‌తో ఆ కోరిక తీరుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సలార్ మూవీ ప్రమోషన్స్‌ను మూవీ టీమ్ స్టార్ట్ చేస్తుందని తెలిసింది. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత ప్రచారం చేపట్టే ఆలోచనలో మూవీ టీమ్ ఉంది. యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్‌ను మించి ఉంటాయని పుకార్లు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్‌లో ప్రభాస్ వెయ్యి మందితో ఫైట్ చేస్తారని కూడా రూమర్స్ వస్తున్నాయి. సలార్ (Salaar) మూవీ కూడా రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సో.. ఫస్ట్ పార్ట్‌కు మాములు క్రేజ్ లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై ఫ్యాన్స్‌కు గట్టి నమ్మకం ఉంది.
సలార్ తర్వాత కల్కీ, మారుతి సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. కల్కీ సమ్మర్లో రిలీజ్ అవనుండగా.. మారుతి మూవీ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఆ తర్వాత కూడా భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని తెలిసింది.