RR: కోహెడలో మిత్రులైన ముగ్గురు మూడు రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బలవన్మరణాల కారణం ఇంకా బయటపడలేదు. ఈ ఆత్మహత్యలను శోధించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. చరవాణుల నుంచి గుట్టు బయట పడాల్సిందేనని పోలీసులు పేర్కొంటున్నారు.