మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో పాటు.. మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’లోను కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఫ్లాప్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు ధమాకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మాస్ రాజా ఆశలన్ని ఈ సినిమాపైనే ఉన్నాయి. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పెళ్లిసందD బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నుండి.. ఇప్పటికే విడుదలైన ‘జింతాక్’ మాస్ బీట్ యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతోంది. ఇక ఇప్పుడు మరో క్రేజీ అప్టేట్ రాబోతోంది.
మాస్ మహారాజా అంటే మాస్ అప్టేట్సేనా.. రొమాంటిక్ అప్టేట్స్ రావా.. అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రొమాంటిక్ గ్లింప్స్‌ను ఆగస్ట్ 31 సాయంత్రం 5.01 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రవితేజ నటిస్తున్న మరో మూవీ రావణాసుర.. సుధీర్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ నిర్మించారు. ఇందుకోసం ఏకంగా 5 కోట్లు ఖర్చు చేసినట్టు టాక్. దాంతో రవితేజ కోసం కోట్లకు కోట్లే ఖర్చు చేస్తున్నారని చెప్పొచ్చు.