అసలు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిదంటే చాలు.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే.. ఇది కొందరి మాట. ఇంకొందరు హిట్ టాక్ వస్తే.. థియేటర్‌కు పరుగులు తీస్తుంటారు. అయితే థియేటర్‌కు వెళ్లలేని కొంతమంది మాత్రం.. ఓటిటి అందుబాటులోకి వచ్చిన తర్వాత దానికోసమే ఎదురు చూస్తుంటారు. తాజాగా సెన్సేషనల్‌గా నిలిచిన ‘కాంతార'(kantara) ఓటిటి కోసం.. ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ మూవీ ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
కన్నడ, తెలుగుతో పాటు మిగతా భాషల్లోను కాంతార మంచి వసూళ్లు రాబడుతుంది. ముఖ్యంగా తెలుగులో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. ఇక ఐదో రోజు 2 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఐదు రోజుల్లో అయితే 22 కోట్ల కలెక్షన్లు అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల మాట. ఇక ఈ వారం వచ్చిన సినిమాలు ఏ మాత్రం తేడా కొట్టిన.. కాంతార దుమ్ముదులపడం ఖాయమంటున్నారు.
అయితే ఈ సినిమాని థియేటర్స్‌లో చూడలేకపోతున్న ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది. దాంతో నవంబర్ 4న ‘కాంతార’ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అది కన్నడ వెర్షన్లో మాత్రమేనని టాక్. మిగతా భాషల్లో ఇంకొన్ని రోజుల తర్వాత ఓటిటిలోకి వస్తుందని అంటున్నారు. అయితే తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు కాబట్టి.. ‘ఆహా’ ఓటిటిలో వచ్చే ఛాన్స్ ఉంది. మరి కాంతార ఓటిటిలోకి ఎప్పుడొస్తుందో చూడాలి.