Razakar: మరో కంట్రవర్సీ మూవీ.. ఇప్పుడు తెలంగాణ టార్గెట్.!
తెలంగాణ ఎన్నికలను టార్గెట్ చేస్తూ నిజాం కాలం నాటి రజాకార్ వ్యవస్థను వక్రీకరించి రజాకార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారని ముస్లిం సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.
Razakar: గత కొన్నాళ్లుగా ఇండస్ట్రిలో(Film Industry) చాలా మార్పులు వచ్చాయి. కంటెంట్ విషయంలో కూడా ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిక్షన్ కథల కన్నా రియాలిటీ కథలనే ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకే మేకర్స్ ఈ స్టోరీలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఈ సబ్జెక్టులు ఎంత వివాదస్పదమైనా సరే వీటినే తెరకెక్కుస్తున్నారు. ఈ తరహా చిత్రాలను తెలుగు పరిశ్రమకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV) ఎప్పుడో పరిచయం చేశారు. రక్తచరిత్ర, వంగవీటి, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని అయితే తాజాగా టాలీవుడ్లో మరో కాంట్రవర్సీ మూవీ రాబోతుంది. యాట సత్యనారయణ(Yata Sathanarayana) దర్శకత్వంలో గూడురు నారయణ రెడ్డి(Guduru Narayana Reddy) నిర్మిస్తున్న చిత్రం రజాకార్(Razakar). ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కావడంతో పలువురు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమను టార్గెట్ చేసే దీన్ని తెరకెక్కించారని ముస్లిం మత పెద్దలు ఆరోపిస్తున్నారు.
చదవండి:Heavy rains : తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. నగరాన్ని కమ్మేసిన ముసురు
రజాకార్ -ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ సినిమా హైదరాబాద్(Hyderabad) సంస్థానంలోని రజాకార్ల అరాచకాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. 1948 నాటి ఘటనలను తప్పుగా చిత్రీకరించి బీజేపీ(BJP) లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని మస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. మరోవైపు ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాల్లో ముస్లిం సమాజాన్ని ఓ బూచిగా, టెర్రరిస్టులుగా చిత్రీకరించారనే విమర్శులు వెల్లువెత్తాయి. ఇప్పుడు తెలంగాణలో రజాకార్లపై తీసిన సినిమాలోనూ అట్లాంటి మరో ప్రయత్నమే చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓ పాఠశాలలో అందరరు బ్రాహ్మణ పిల్లలను రజాకర్లు చంపేసినట్లు, ఓ తుపాకీ కత్తిపై ఓ బ్రాహ్మణుడు మృతదేహం వేలాడుతున్నట్టు మోషన్ పోస్టర్ లో చూపించారు. ఆనాడు రజాకార్ వ్యవస్థ ఒక కులం అంటూ టార్గెట్ చేయలేదని, వారికి ఎదురుతిరిగిన వారినే హతమార్చారని, ఈ పోరాటంలో ఎక్కువగా రెడ్లు, దళితులే బలయ్యారని చెబుతున్నారు. ఇది కేవలం ఎలక్షన్ల కోసం, డబ్బు కోసము చేస్తున్నదే తప్పా ఇందులో నిజం కానీ వారికి దేశం మీద గౌరవం కానీ లేదని ముస్లిం మతపెద్దలతో పాటు పలువురు రాజకీయ నేతలు అంటున్నారు. అలాగే సెన్సార్ బోర్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరించరంటున్నారు.