Rashmika: శ్రీలీల కాదంది.. మళ్లీ రష్మికను లైన్లో పెట్టాడు!
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఫ్లాపులు వచ్చిన రౌడీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఇటీవల వచ్చిన 'ఖుషి' సినిమా ప్రూవ్ చేసింది. కానీ యంగ్ బ్యూటీ శ్రీలీల మాత్రం రౌడీని రిజెక్ట్ చేసింది. దాంతో మళ్లీ రష్మికను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.
లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన ‘ఖుషి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఖుషితో తన అభిమానులకు వంద కుటుంబాలకు ఒక్కో లక్ష చొప్పున కోటీ రూపాయలు ఇచ్చాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే పరుశురాంతో ఓ మూవీ చేస్తున్నాడు. అయితే గౌతమ్ తిన్ననూరి సినిమాలో ముందుగా శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారు. కానీ తాజాగా ఈ యంగ్ బ్యూటీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక రౌడీ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలొచ్చాయి. దీంతో మరోసారి రష్మికతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడట రౌడీ.
రష్మిక మందన, విజయ్ దేవరకోండది క్రేజీ కాంబినేషన్. గీత గోవిందం సినిమా నుంచి స్టార్ట్ అయిన ఈ కాంబినేషన్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమారిజల్ట్ తేడా కొట్టేసింది. అప్పటి నుంచి మరో సినిమా చేయపోయినప్పటికీ.. ఇద్దరు డేటింగ్లో ఉన్నారనే న్యూస్ మాత్రం వినిపిస్తునే ఉంటుంది. కానీ మళ్లీ ఈ జోడి కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు ఆ వెయిటింగ్‌కి ఎండ్ కార్డ్ వేస్తూ.. విజయ్,రష్మిక మళ్లీ కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. గౌతమ్ తిన్నునూరితో చేస్తున్న స్పై థ్రిల్లర్ సినిమాలో శ్రీలీల అవుట్ అవడంతో.. ఆమె ప్లేస్‌లోకి రష్మికను తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి క్రేజీగా మారింది ఈ కాంబినేషన్. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.