»Pushpa 2 Pushpa 2 A Sensation With A Thousand Crores Breaking All Records
Pushpa 2: వెయ్యి కోట్లతో ‘పుష్ప 2’ సంచలనం? అన్ని రికార్డులు బద్దలు?
నిన్న మొన్నటి వరకు ప్రభాస్, రాజమౌళి రికార్డ్స్‌ను టచ్ చేయాలంటే.. మళ్లీ ఈ ఇద్దరి వల్లే సాధ్యమవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇండియన్ సినిమా దగ్గర ఉన్న అన్ని రికార్డులు తిరగరాసేలా ఉన్నాడు.
Pushpa 2: 'Pushpa 2' a sensation with a thousand crores? Breaking all records?
Pushpa 2: పుష్ప పార్ట్ 1తో పాన్ ఇండియా భాషలతోనే సరిపెట్టుకున్నాను, కానీ ఈసారి అలా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దండయాత్ర చేస్తానంటూ వచ్చేస్తున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే ఊహించని బిజినెస్ లెక్కలతో షాక్ ఇస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది పుష్ప 2. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా జరగని బిజినెస్ పుష్ప2కి జరుగుతోంది. బాలీవుడ్ హీరోలే కాదు.. ప్రభాస్‌ను సైతం బీట్ చేసేలా ఉన్నాడు అల్లు అర్జున్. పుష్ప2 పై క్రేజ్ చూస్తే దిమ్మతిరిగాల్సిందే. ఈ సినిమా బిజినెస్.. ఏకంగా వెయ్యి కోట్లని అంటున్నారు.
ఇదే నిజమైతే.. పుష్ప2 ఓ సంచలనం అనే చెప్పాలి. ‘పుష్ప 2’ విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. కానీ ఇప్పటికే.. డిజిటల్, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. నార్త్ ఇండియా రైట్స్ కోసం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ఏకంగా 200 కోట్లు వెచ్చించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక సౌత్ స్టేట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా.. దాదాపు 250 నుంచి 300 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. మొత్తంగా.. ఇండియన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే 550 కోట్లు రావొచ్చని అంటున్నారు. ఎలాగూ ఓవర్సీస్లో కూడా భారీ డిమాండ్ ఉంది.
ఇక.. ‘పుష్ప 2’ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటిటి వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని అంటున్నారు. అన్ని భాషలకు గాను 275 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టుగా సమాచారం. శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపితే.. నాన్ థియేట్రికల్ బిజినెస్ 400 కోట్లు రీచ్ అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా ఓవరాల్‌గా.. పుష్ప2 బిజినెస్ 1000 కోట్ల వరకు జరగనుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప2 ఓ సంచలనం అనే చెప్పాలి.