బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్. ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారు. అందులో భాగంగా కాస్త ఆలస్యంగా ఈ మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ప్రధాన పాత్రల పోస్టర్లను ఒక్కొక్కరిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రణ్బీర్ లుక్ రివీల్ చేశారు. రీసెంట్గా సీనియర్ నటుడు అనిల్ కపూర్, రష్మిక లుక్స్ విడుదల చేశారు. ఈ ఇద్దరి లుక్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీలోని మరో కీలక నటుడు అయిన బాడీ డియోల్ లుక్ ని రిలీజ్ చేశారు.
‘యానిమల్’ శత్రువు అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాబీ డియోల్ మెయిన్ విలన్ అని తెలుస్తుంది. ఇప్పటికే బాబీ డియోల్ లవ్ హాస్టల్ సినిమాలో విలన్గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక యానిమల్లో బాబీ రోల్ ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీ ట్రైలర్ ని ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ యానిమల్ సినిమా చాలా హింసాత్మకంగా సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. గ్యాంగ్స్టర్ కథాంశంతో యానిమల్ సినిమా మోస్ట్ వైలెంట్గా రానుంది.