ఈ మధ్య టాలీవుడ్లో విడాకుల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఫేమస్ యాంకర్, నటి కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ ఆ మధ్య తెగ వైరల్ అయింది. తాజాగా దీనిపై రిపోర్టర్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అమ్మడు.
Colors Swati: నాగ చైతన్య, సమంత మొదలుకొని.. నిన్న నిహారిక, చైతన్య వరకు విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతునే ఉంది. అదే బాటలో కలర్స్ స్వాతి డివోర్స్ వైపు అడుగులు వేస్తున్నట్టు వార్తలొచ్చాయి. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, కలర్స్ ప్రోగ్రాం ద్వారా చాలా పాపులర్ అయిన స్వాతి రెడ్డి.. కలర్స్ ప్రోగ్రాంతో కలర్స్ స్వాతిగా మారిపోయింది. అదే పేరుతో బుల్లితెరపై పలు ప్రోగ్రామ్స్ చేసిన స్వాతి.. ఆ తర్వాత హీరోయిన్గా కూడా రాణించింది. అయితే హీరోయిన్గా కెరీర్ ఫేడవుట్ అవుతున్న సమయంలో.. 2018 సంవత్సరంలో వికాస్‌ని ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది స్వాతి. వికాస్ వాసు వృత్తిరీత్యా పైలట్. వివాహం అనంతరం ఈ జంట విదేశాల్లో సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి సినిమాలకు దూరమైన స్వాతి.. వైవాహిక జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తోంది.
అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో.. ఆమె విడాకులు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. అందుకే మళ్లీ సినిమాలతో బిజీ అవుతోందని అంటున్నారు. ఇదే విషయాన్ని అడగ్గా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది అమ్మడు. ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా.. విడాకులకు సంబంధించిన ప్రశ్న స్వాతికి ఎదురైంది. విడాకులపై క్లారిటీ ఇవ్వాలని ఓ రిపోర్టర్ అడగ్గా.. చెప్పను గాక చెప్పను అంటూ.. షాక్ ఇచ్చింది. అసలు.. ఈ కార్యక్రమానికి, ఆ ప్రశ్నకు సంబంధం లేదు, అది అనవసరం అని నా అభిప్రాయం.. అందుకే నేను సమాధానం చెప్పను.. అని స్వాతి చెప్పుకొచ్చింది. దీంతో సదరు రిపోర్టర్ షాక్ అయినంత పనైంది. ఇక నవీన్ చంద్ర హీరోగా నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాను శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో క్రిష్వి ప్రొడక్షన్స్, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్‌పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు.