డైరెక్టర్ కృష్ణవంశీ(Krishnavamsi) 'రంగ మార్తాండ'(Rangamarthanda) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను కాలెపు మధు, వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా(Ilayaraja) సంగీతాన్ని అందిస్తున్నారు. మూవీలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఉగాది(Ugadi) పండగ సందర్భంగా 22వ తేదిన రిలీజ్ చేయనున్నారు.
డైరెక్టర్ కృష్ణవంశీ(Krishnavamsi) ‘రంగ మార్తాండ'(Rangamarthanda) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను కాలెపు మధు, వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా(Ilayaraja) సంగీతాన్ని అందిస్తున్నారు. మూవీలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఉగాది(Ugadi) పండగ సందర్భంగా 22వ తేదిన రిలీజ్ చేయనున్నారు.
‘రంగ మార్తాండ’ ట్రైలర్:
తాజాగా ‘రంగమార్తాండ'(Rangamarthanda) సినిమా నుంచి చిత్ర యూనిట్ ట్రైలర్(Trailer)ను విడుదల చేశారు. రంగస్థల నటుడిగా ప్రకాశ్ రాజ్(Prakash Raj) గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకునేలా ట్రైలర్ లో చూపించారు. కుటుంబీకులే పెద్దరికానికి ఎదురు తిరిగితే తన కూతురే తనను దొంగగా అనుమానించే సంఘటనలు అందర్నీ కలచి వేస్తాయి. ఈ తరుణంలో భార్యతో ప్రకాశ్ రాజ్ మరో ప్రయాణాన్ని మొదలు పెట్టడం వంటి సీన్లు ట్రైలర్లో(Trailer) చూపించారు.
ఈ సినిమా బలమైన ఎమోషన్స్ మధ్య సాగుతుందని ట్రైలర్(Trailer)లో స్పష్టంగా తెలుస్తోంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే రంగస్థల కళాకారుడి అనుభవాలే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ అప్ డేట్స్ వదిలిన చిత్ర యూనిట్ తాజాగా ‘రంగ మార్తాండ'(Rangamarthanda) సినిమా ట్రైలర్ ను రిలీజ్(Release) చేసింది. చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ కృష్ణ వంశీ(Krishnavamsi) తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.