Chaitu DHOOTHAపై రానా నాయుడు ఎఫెక్ట్..? అందుకే ఆలస్యం…?
నాగ చైతన్య ‘ధూత’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సంబంధించి ఇప్పటివరకు సమాచారం లేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ మాదిరిగా ఆదరణ లభించదనే బెంగ వారిని గట్టిగా పట్టుకుందని తెలిసింది.
Chaitu DHOOTHA:బాబాయ్-అబ్బాయ్ కలిసి నటించిన రానా నాయుడు (Rana naidu) వెబ్ సిరీస్కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. న్యూడిటీ, మాస్ డైలాగ్స్ ఉండటంతో అంతగా ఆదరణ పొందలేకపోయింది. ఈ సిరీస్ ఎఫెక్ట్ నాగ చైతన్య ‘ధూత’పై (DHOOTHA) పడింది. విక్రమ్ కే కుమార్ హర్రర్ జోనర్లో సిరీస్ను తెరకెక్కించాడు. ఇప్పటివరకు రిలీజ్ మాత్రం కాలేదు. ఇందుకు కారణం.. రానా నాయుడు మాదిరిగా ప్రేక్షకుల ఆదరణ లభించదనే బెంగ వారిని వెంటాడుతోందని తెలిసింది.
వాస్తవానికి ధూత ఈ జనవరిలో స్ట్రీమ్ (stream) అవుతుందని అంతకుముందు నాగ చైతన్య (naga chaitanya) ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటివరకు సిరీస్ రిలీజ్కు సంబంధించి ప్రకటనే లేదు. సిరీస్లో చైతు (chaitu) నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించారట.. అందుకే రిలీజ్పై నాగార్జున వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. వీలయితే కొన్ని సన్నివేశాలను రీ షూట్ కూడా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
అప్పుడెప్పుడో ‘ధూత’ (DHOOTHA) టీజర్ వచ్చింది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సిరీస్ (series) కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ ఒక్క ప్రకటన కూడా రాలేదు. సిరీస్ను ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ (vikram) తీశారు. మనం, థాంక్యూ, 24 లాంటి హిట్ సినిమాలను ఆయన తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
నాగ చైతన్య ‘కస్టడీ’ మూవీ వచ్చే నెల 12వ తేదీన విడుదలవనుంది. ఈ సినిమాను వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. తెలుగుతోపాటు తమిళంలో కూడా రిలీజ్ అవనుంది. కస్టడీ తర్వాత అయినా ధూత (DHOOTHA) బొమ్మ పడుతుందో లేదో చూడాలీ మరీ.