Ramcharan: బాలీవుడ్ బడా దర్శకుడితో రామ్ చరణ్.. ఇది జరిగితే ఓ సంచలనం!
ఓ బాలీవుడ్ బడా డైరెక్టర్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే ఈ క్రేజీ కాంబో సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనమే అని చెప్పొచ్చు.
ట్రిపుల్ ఆర్ తర్వాత రెండు సినిమాలు కమిట్ అయ్యాడు రామ్ చరణ్. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. కానీ ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. ఇక గేమ్ చేంజర్ తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు చరణ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ మోస్ట్ వాంటేడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు హిరాణీ చేసింది కేవలం ఐదు సినిమాలు మాత్రమే.
మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకె, సంజు.. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక 6వ సినిమాగా షారుఖ్ ఖాన్‌తో ‘డంకీ’ చేస్తున్నాడు రాజ్ కుమార్ హిరాణీ. డిసెంబర్ 22న సలార్‌తో పోటీగా రిలీజ్ అవుతోంది డంకీ. ఈ సినిమా తర్వాత చరణ్‌తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడట హిరాణీ. నిన్న ముంబైలో అయ్యప్ప దీక్షను విరమించాడు చరణ్. ఆ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కలిశాడు. అలాగే రాజ్ కుమార్‌ను కూడా కలిశాడట చెర్రీ.
ధోనిని కలిసింది కమర్షియల్ యాడ్ కోసమే అయినా.. రాజ్ కుమార్ హిరానీతో మాత్రం కథా చర్చలు జరిపాడని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజ్ కుమార్, చరణ్‌కు స్క్రిప్ట్ నేరేట్ చేశాడని.. కుదిరితే ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. రాజ్ కుమార్ హిరాణీతో రామ్ చరణ్ సినిమా అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. కానీ ఇరవై ఏళ్ల కెరీర్లో కేవలం ఐదు సినిమాలు మాత్రమే హిరాణీ.. చరణ్‌తో సినిమా ఇప్పట్లో సాధ్యమేనా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి.. ఈ వార్త నిజమేనా? లేక రూమర్‌గానే ఉండిపోతుందో!