బుధవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఓ వీడియోలో అనుకోకుండా క్లీంకార ఫేస్ రివీల్ అయ్యింది.
Ram Charan : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, బుధవారం ఉదయం వారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన(Ram Charan, Upasana) దంపతులు తమ కుమార్తె క్లీంకారతో కలిసి ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు. ఈ జంటకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇందులో మరో ప్రత్యేకమైన విషయమూ ఉంది. రామ్చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించి తొమ్మిది నెలలు గడుస్తున్నా వారు ఇప్పటి వరకు పాప ఫోటోను రివీల్ చేయలేదు. దీంతో ఆమె ఎలా ఉంటుందా? అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ తిరమల వీడియోల్లో అనుకోకుండా పాప ముఖం కాస్త రివీల్ అయింది.
దీంతో ఉపాసన చేతిలో ఒదిగిపోయి ఉన్న క్లీంకార(KlinKaara) వీడియోని పాస్ చేసి మరీ అంతా చూస్తున్నారు. క్యూట్ మెగా ప్రిన్సెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు అతి కొద్ది సమయంలోనే వైరల్గా మారింది. ఆ వీడియోని మరి మీరూ చూసేయండి.