‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. తర్వాత శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను.. వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరాకు థియేటర్లలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శంకర్ మార్క్‌లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా సాంగ్ షూటింగ్ కోసం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు రామ్ చరణ్ అండ్ కియారా అద్వాణీ. అయితే వెకేషన్లో కూడా వర్కౌట్లతో బిజీగా ఉన్నాడు చరణ్. అందుకు సంబంధించిన ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్ కోసం వెళ్లినా, గ్యాప్ దొరికినా, వెకేషన్లకు వెళ్లినా.. వర్కౌట్ తప్పదని అంటున్నాడు చరణ్.
ఆ వీడియోలో చరణ్ తన టీంతో కలిసి చేసిన అల్లరి, వర్కౌట్స్ హైలెట్‌గా ఉంది. ఆర్సీ 15 సినిమా సెట్లో ఏర్పాటు చేసిన జిమ్‌లో.. ట్రైనర్ పర్యవేక్షణలో వర్కవుట్స్ చేస్తున్నాడు.. బరువులు ఎత్తడమే కాకుండా.. సెట్లో రన్నింగ్, స్విమ్మింగ్ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. All set for my upcoming schedule.. workout has no vacation అంటూ రాసుకొచ్చాడు.
ఇకపోతే.. ఒక్క సాంగ్ కోసమే 15 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయిస్తున్నాడట శంకర్. అందుకే చరణ్ గట్టిగా కసరత్తులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమాతో చరణ్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో దుమ్ముదలుపడం ఖాయమంటున్నారు.