స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య లొల్లి కొత్తేం కాదు. మరీ ముఖ్యంగా నందమూరి వర్సెస్ మెగా వార్ కామన్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన సమయంలో చరణ్, తారక్ ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో కొన్నాళ్లు సోషల్ మీడియా హీటెక్కిపోయింది. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని గొడవ గొడవ చేశారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి పై గుస్సాయించారు. తమ హీరోకు తగినంత న్యాయం జరగలేదని.. ఆర్ఆర్ఆర్లో స్కోప్ తగ్గిందని కామెంట్స్ చేశారు. అయితే ఇటీవల యంగ్ టైగర్ పేరు ఆస్కార్ రేసులో ఉండే ఛాన్స్ ఉందని తెలియడంతో ఎగిరి గంతేశారు. దాంతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేశారు.
అయితే ఇప్పుడు తమ వంతు వచ్చిందంటున్నారు మెగా ఫ్యాన్స్. తాజాగా ఆస్కార్ బరిలో నిలిచే నటుల జాబితాలో రాంచరణ్ పేరుని కూడా చేర్చింది ‘వెరైటీ’ మ్యాగజైన్. దాంతో చరణ్ అభిమానులు అంతకు మించి అనేలా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇంకేముంది మా హీరోకి అంటే మా హీరోకి ఆస్కార్ అంటూ.. మరోసారి సోషల్ మీడియాని హోరెతిస్తున్నారు. అయితే గతంలో ఎన్టీఆర్‌ను పెయిడ్ ఆస్కార్ ప్రమోషన్స్ అంటూ.. మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేయగా.. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. అయితే ఆస్కార్ విషయంలో ఫ్యాన్స్ హంగామా చేయడం వరకు ఓకే. కానీ విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు కొందరు అభిమానులు. ఏదేమైనా నిజంగానే చరణ్-తారక్ ఆస్కార్‌లో చోటు దక్కించుకుంటారేమో చూడాలి.