»Rajinikanth Lal Salaam Moideen Bhai In Bhasha Bhai Range
Rajinikanth: లాల్ సలామ్.. భాషా భాయ్ రేంజ్లో మొయిదీన్ భాయ్!
తలైవా రజనీకాంత్(rajinikanth) క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ, ఎప్పటికీ స్టైల్ ఆఫ్ ఐకానిక్ రజనీ కాంతే. ఏడు పదుల వయసులోను సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా రజనీ కాంత్ కొత్త సినిమా లుక్ రిలీజ్ చేయగా.. అదుర్స్ అనేలా ఉంది. లాల్ సలామ్ అంటు వస్తున్న రజనీ.. ఈ సారి భాషా భాయ్ రేంజ్లో కనిపించబోతున్నారు.
గతేడాది అన్నాతే చిత్రంతో బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టేశారు రజనీ కాంత్(rajinikanth). ఈ సినిమా తర్వాత.. సూపర్ స్టార్ బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం రజినీ.. నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగష్టు 10 రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్‌గానే ప్రకటించారు.
ఇదే సమయంలో రజనీ నుంచి లాల్ సలామ్ అనే సినిమా రాబోతోంది. రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. తమిళ హీరో విష్ణు విశాల్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రజనీ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా లాల్ సలామ్(Lal Salaam) నుంచి రజినీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రజనీ మొయిదీన్ భాయ్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు తెలిపారు. ఈ సినిమాని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో.. మన అందరి ఫేవరెట్ భాయ్.. మళ్ళీ ముంబై కి వచ్చాడు.. స్వాగతం పలకండి.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఇది చూసిన తర్వాత 1995లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘భాషా’లో బాషా భాయ్‌ని చూసినట్టుందని అంటున్నారు అభిమానులు. ఇప్పటికీ భాషా సినిమా బుల్లితెరపై కనిపిస్తే అతుక్కుపోతుంటారు.
ఈ భాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే.. అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తునే ఉంటుంది. దాంతో లాల్ సలామ్(Lal Salaam)లోని మొయిదీన్ భాయ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి లాల్ సలామ్ ఎలా ఉంటుందో చూడాలి.