Hrithik Roshan: పెళ్లి డ్యాన్స్‌కు రూ.2.5 కోట్లు ఏంది సామి!
సెలబ్రిటీస్‌కు ఉండే డిమాండ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లతో ప్రముఖ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయించడం కోసం కోట్ల రూపాయలు ఇస్తుంటాయి బడా కంపెనీలు. ఇక సినిమాల రెమ్యూనరేషన్స్ వందల కోట్ల వరకు ఉంటుంది. అలాంటి హీరోలతో పెళ్లిలలో డ్యాన్స్ చేయించాలంటే.. ఎంత ముట్టజెప్పాలో హృతిక్ రోషన్(Hrithik Roshan)ను చూస్తేనే అర్థం అవుతోంది.
బాలీవుడ్ సెలబ్రెటీలకు పార్టీల్లో డ్యాన్స్ చేస్తే కోట్లు కుమ్మరిస్తరనే విషయం తెలిసిందే. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సమయంలో స్టార్ హీరోలకు ఓ రేంజ్లో డిమాండ్ ఉంటుంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా పార్టీల్లో చిందేస్తూ.. కోట్లు దండుకున్న వారే. తాజాగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan)కూడా ఓ వివాహ వేడుకలో సందడి చేసినందుకు గానూ భారీగా తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల హృతిక్ రోషన్ ఓ పెళ్లి(marriage)కి అటెండ్ అయ్యాడు. ఆ పెళ్లిలో గుంఘ్రూ, బ్యాంగ్ బ్యాంగ్ అనే పాటలకు అదిరిపోయేలా డాన్స్(dance) చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగానే హృతిక్ రోషన్ డ్యాన్స్ స్ప్రింగ్‌లా ఉంటుంది. అలాంటి హీరో పెళ్లిలో డ్యాన్స్ చేస్తే ఇంకేమైనా ఉందా? అలాంటి మ్యాజిక్ జరగాలంటే.. కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే.
అందుకే ఓ పెళ్లిలో హృతిక్ డాన్స్(Hrithik dance) చేసినందుకు ఏకంగా 2.5 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మహా అయితే ఈ డ్యాన్స్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. దానికే కోట్లు తీసుకుంటున్నారంటే.. ఈ లెక్కన బాలీవుడ్ హీరోల సైడ్ ఇన్కమ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే హృతిక్ రోషన్ లాంటి హీరో పెళ్లిలో డ్యాన్స్ చేశాడంటే.. సదరు జంట చాలా లక్కీ అంటున్నారు నెటిజన్స్.
ఇకపోతే.. ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్‌తో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్నాడు హృతిక్. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అన్నట్టు వార్2 మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కూడా డ్యాన్స్ ఇరగదీస్తారు. అలాంటి ఈ ఇద్దర్ స్టార్స్‌కి ఓ పాట పడితే.. స్క్రీన్స్ చిరిగిపోతాయ్ అని చెప్పొచ్చు.