Bunny : నక్సల్స్ ఏరియాలో పుష్ప2.. రిస్క్ చేస్తున్న బన్నీ!
Bunny : ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. దాంతో ఓ రోజు ముందే.. పుష్ప2 నుంచి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు సుక్కు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్నట్టు.. అసలు పుష్ప ఎక్కడ? అంటూ గ్లింప్స్‌తో ఎన్నో డౌట్స్ క్రియేట్ చేశాడు మన లెక్కల మాస్టారు.
పుష్ప సినిమాలో పుష్పరాజ్‌గా ఊరమాస్ లుక్‌లో రగ్గ్డ్గా రఫ్‌గా కనిపించి.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ముఖ్యంగా.. పుష్పరాజ్ యాక్టింగ్, తగ్గేదేలే మ్యానరిజానికి కనెక్ట్ అయిపోయారు నార్త్ ఆడియెన్స్. తెలుగులో కంటే హిందీ బెల్ట్ వద్దే పుష్ప మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అందుకే ఈసారి మరింత పవర్ ఫుల్‌గా రాబోతున్నారు బన్నీ, సుక్కు. రీసెంట్గా రిలీజ్ చేసిన మూడు నిమిషాల వీడియో, బన్నీ ఫస్ట్ లుక్‌తో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో.. పుష్ప సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఎంత రిస్క్ అయినా చేసేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. మే ఫస్ట్ వీక్ నుంచి కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ షెడ్యూల్‌ను దట్టమైన అటవీ ప్రాంతంలో ప్లాన్ చేస్తున్నారట. అది కూడా మావోయిస్టులు కంచుకోట ఒడిశాలోని మల్కాన్‌గిరి ఫారెస్ట్‌లో షూట్ చేయబోతున్నారట. స్వాభిమాన్ అంచల్ ఏరియాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మల్కాన్‌గిరి ఏరియాలో.. స్టార్ హీరోలు ఎవరూ షూటింగ్ చేయలేదు. దీంతో ఫస్ట్ టైం అల్లు అర్జున్ రిస్క్ చేయబోతున్నట్టేనని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ ఏరియాలో షూటింగ్ చేసేందుకు పర్మిషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు స్టార్ క్యాస్టింగ్ పాల్గొననున్నట్లుగా వినిపిస్తోంది. మరి ఇంత రిస్క్ చేస్తున్న బన్నీకి.. పుష్ప2 ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తుందో చూడాలి.