డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో చిరు సినిమా చేసే అవకాశాలు బాగానే ఉన్నాయి. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ గాడ్ ఫాదర్ రిలీజ్ సమయంలో పూరితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు మెగాస్టార్. దాంతో ఆటోజాని కథకు బదులు మరో కొత్త కథ రాస్తున్నానని చెప్పాడు పూరి. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. పూరి, మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ కథ రాస్తున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు లైగర్ సమస్యలతో సతమతమవుతున్న పూరి.. మరోవైపు తన టీమ్‌తో కలిసి మెగాస్టార్ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. మెగాస్టార్ కోసం ఓ ఎమోషనల్ యాక్షన్ స్టోరీ రాస్తున్నట్టు సమాచారం. తండ్రి కొడుకుల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టాక్. పూర్తి కథ రెడీ అయ్యాక.. త్వరలోనే చిరుని కలవనున్నాడట పూరి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ ‘బాస్ పార్టీ’ నవంబర్ 23న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో చిందేయనున్నారు చిరు. ఇప్పటికే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే.. వాల్తేరు వీరయ్యతో పాటు మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు మెగాస్టార్. అలాగే యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతోను ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. దాంతో పూరితో ప్రాజెక్ట్ ఇప్పుడే ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. మరి ఈసారైనా ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.