Director Prashant Neil: టాలీవుడ్ హీరోలే టార్గెట్‌గా ప్రశాంత్ నీల్?
కెజియఫ్‌తో సంచలనం సృష్టించాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ముందుగా ఈయనను కన్నడ డైరెక్టర్ అనుకున్నారు. కానీ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. ఇప్పుడు కన్నడను వదిలిపెట్టి టాలీవుడ్ బడా హీరోలే టార్గెట్‌గా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.
2014లో ఉగ్రం అనే సినిమా(Ugram Movie)తో తన సత్తా ఏంటో చూపించాడు ప్రశాంత్ నీల్(Director Prashant Neil). ఆ తర్వాత 2018లో కెజియఫ్ చాప్టర్ వన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ పైన 2022లో కెజియఫ్ చాప్టర్ 2తో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ రూట్ మారింది. ఫస్ట్ మూడు సినిమాలు కన్నడ హీరోలతో చేసినా ప్రశాంత్ నీల్.. ఇప్పుడు వరుస పెట్టి తెలుగు హీరోలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఈ విషయంలో కన్నడ అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ కన్నడ హీరోలతో సినిమాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ నీల్ మావా టార్గెట్ మాత్రం టాలీవుడ్ టాప్ హీరోలే. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్(Director Prashant Neil). సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది. ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఇక సలార్ కంప్లీట్ అవకముందే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత కెజియఫ్ 3 చేస్తాడని అనుకున్నా.. ఇప్పట్లో కష్టమే అంటున్నారు. ఇప్పటికే సలార్ మూవీ రెండు భాగాలుగా రాబోతోందని వినిపిస్తోంది. అదే నిజమైతే.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కంటే ముందు సలార్ 2 వచ్చే ఛాన్స్ ఉంది.
ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉండనుంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా డివివి దానయ్య నిర్మాణంలో రానుందని టాక్. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అయ్యే సరికి మరో మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. సలార్, ఎన్టీఆర్ సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేస్తే.. ప్రశాంత్ నీల్(Director Prashant Neil) ఇక్కడే జెండా పాతేయనున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం తెలుగు మార్కెట్ ఓ రేంజ్లో ఉంది కాబట్టి.. తెలుగు హీరోలతో ప్రశాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.