Prabhas-Maruti : స్పీడ్ మామూలుగా లేదుగా.. కానీ ఎందుకలా!?
Prabhas-Maruti : ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేల కోట్ల ప్రాజెక్ట్స్ ప్రభాస్ సొంతం. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్.. ఇలా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేల కోట్ల ప్రాజెక్ట్స్ ప్రభాస్ సొంతం. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్.. ఇలా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్. అయితే ఇలాంటి సినిమాల మధ్య ఊహించని సినిమా చేస్తున్నాడు. అదే మారుతి ప్రాజెక్ట్. మామూలుగా ప్రభాస్ ఏదైనా కొత్త సినిమా మొదలు పెడితే.. ఆ సందడే వేరు. కానీ మారుతితో మాత్రం అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్‌గా షూటింగ్ మొదలు పెట్టేశాడు. అంతేకాదు.. లేటెస్ట్ అప్డేట్ వింటే, ప్రభాస్ ఇంత స్పీడ్‌గా ఉన్నాడా అని.. అనిపించక మానదు. ఇప్పటి వరకు మారుతి సినిమా కోసం 18 రోజులు షూటింగ్లో పాల్గొన్నాడట ప్రభాస్. మొత్తంగా మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారని టాక్. దాంతో ఈ సినిమాకి సంబంధించి 20 శాతం టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన షెడ్యూల్లో ప్రభాస్, మాళవిక మోహనన్ పై షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయినా కూడా ప్రభాస్ ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. మధ్యలో ఫోటోలు లీక్ అయినా.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే అప్డేట్ కావాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కానీ ప్రభాస్, మారుతి తమ పని తాము చేస్తున్నారు. అయితే ఆదిపురుష్ రిలీజ్ తర్వాత ఈ మూవీకి సంబందించిన అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. మరి అప్పుడైనా అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. అన్నట్టు ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదట.