ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి వేల కోట్ల ప్రాజెక్ట్స్, వందల కోట్ల వసూళ్లే నిదర్శనమని చెప్పొచ్చు. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు కూడా వందల కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తున్నాయి. ఆదిపురుష్ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే జవాన్ సినిమా ఆదిపురుష్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. కానీ ప్రభాస్‌ను టచ్ చేయలేకపోయాడు ప్రభాస్.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్.. జవాన్తోను అదరగొట్టేశాడు. పక్కా కమర్షియల్ ఫిల్మ్‌గా అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 129 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయినా కూడా 2023లో సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ ఫిల్మ్‌గా జవాన్ నిలిచింది. మొదటి ప్లేస్‌లో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఉంది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నా కూడా మొదటి రోజు 136 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
దీంతో ఆదిపురుష్ మొదటి రోజు రికార్డుని జవాన్ సినిమా బద్దలుకొట్టలేకపోయింది. కానీ జవాన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడోస్థానంలో ఈ ఏడాది రిలీజ్ అయిన షారుఖ్ పఠాన్ సినిమా ఉంది. అయితే జవాన్ తర్వాత మూడు వారాలకు రావాల్సిన సలార్ పోస్ట్ పోన్ కాకపోయి ఉంటే.. ప్రభాస్ తన రికార్డులను తనే బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్స్ చేసేవాడు. అలాగే ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా సలార్ నిలిచేది. అంతేకాదు.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లు రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉన్నట్రిపుల్ ఆర్ ఆల్ టైమ్ రికార్డు కూడా బద్దలై ఉండేది.
కానీ సలార్ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వచ్చిన కూడా సెన్సేషన్‌గా నిలవడం గ్యారెంటీ. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరెక్కిస్తున్న సినిమా అవడం.. ప్రభాస్ ఫ్లాపుల్లో ఉండడంతో.. సలార్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏదేమైనా.. ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ పేరు మీదే ఆల్ టైం రికార్డ్స్ ఉన్నాయి. మరి సలార్ ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.