Salaar: ‘సలార్’ బ్యాడ్ న్యూస్.. కానీ భారీ ఓటిటి డీల్ క్లోజ్!
కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్‌గా సలార్ తెరకెక్కుతోంది. బాహుబలి తర్వాత ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కు ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకం కానుంది. కానీ అఫీషియల్‌గా వాయిదా వేసేశారు మేకర్స్. కానీ ఓటిటి డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ 28వ తేది నుంచి సలార్ పోస్ట్‌పోన్ అయిందనే వార్తలపై ఎట్టకేలకు మేకర్స్ స్పందించారు. ఈ చిత్రంపై మీరు చూపిస్తున్న సపోర్ట్‌కి థ్యాంక్స్. కొన్ని అనుకోని కారణాల వలన సెప్టెంబర్ 28 నుండి సలార్‌ను వాయిదా వేస్తున్నాం. ఈ సినిమాను హయ్యెస్ట్ స్టాండర్డ్స్ లో అందించడానికి మా టీమ్ శ్రమిస్తోందని.. త్వరలోనే రిలీజ్ డేట్ చెబుతామని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోందని చెప్పొచ్చు.
మరోవైపు హోంబలె ఫిలింస్ వారు సలార్ బిజినెస్ డీల్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సలార్ మూవీకి ఓవర్సీస్లో భారీ డిమాండ్ ఏర్పడిందనే టాక్ ఉంది. ఇక ఓటిటి డీల్స్ అయితే సలార్ క్రేజ్ ఏంటో నిరూపిస్తున్నాయి. ఈ సినిమా కోసం రెండు బడా ఓటిటి సంస్థల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఏకంగా 200 కోట్ల ఆఫర్‌ని మేకర్స్ ముందు పెట్టాయి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు.
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాల ఓటిటి రైట్స్‌ను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో సలార్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ గట్టిగా ట్రై చేసింది. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ కంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ ఆఫర్ చేసినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీంతో ఫైనల్‌గా సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసం నెట్‌ఫ్లిక్స్ రికార్డుస్థాయిలో చెల్లించేందుకు ఓకె చెప్పినట్టు సమాచారం. దాదాపు 200 కోట్ల వరకు ఈ డీల్ క్లోజ్ అయిందని తెలుస్తోంది.