మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ విడుదలకు దగ్గరపడుతోంది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నారు.
చిరంజీవి మరో సినిమాను లైన్ లో పెట్టారు. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు మూవీల డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో చిరు మూవీ చేయనున్నారు. కాగా ఈ మూవీని ఇటీవల చిరు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే, ఈ మూవీకి ఆయన కూతురు సుస్మిత కొణిదెల తన సొంత బ్యానర్లో నిర్మించాలనుకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నిర్మాణ బాధ్యతలను మరో సంస్థ కూడా తీసుకుండటం విశేషం. ఈ మూవిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. మొత్తంగా పీపుల్స్ మీడియా కాకుండా, ఇద్దరూ కలిసి ఈ మూవీని నిర్మించనున్నారు.
నిర్మాతగా సుస్మిత పేరు మాత్రం ఉంటుందని తెలుస్తోంది. అయితే తెర వెనుక పెట్టుబడి పెట్టి నడిపించేది అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే అనే ప్రచారం జరుగుతోంది. గుడ్ విల్ పేరిట, లాభాల్లో కొంత వాటా సుస్మితకు ఇవ్వడానికి పీపుల్ మీడియా సంస్థ సుముఖంగా ఉందట. డీల్ బాగుండటంతో, అందరూ ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.