Peda Kapu 1: ‘పెద కాపు 1’ ట్రైలర్ రిలీజ్.. ఊరమాస్ సినిమా
ముందు ఫస్ట్ లుక్ పోస్టర్, తర్వాత గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ఒక్కొక్కటిగా సినిమా పై అంచనాలు పెంచకపోతే.. జనాలు థియేటర్లకి రారు. టీజర్, ట్రైలర్‌తోనే సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా క్లాస్ డైరెక్టర్ నుంచి ఊరమాస్ సినిమా వస్తున్నట్టుగా.. పెదకాపు1 ట్రైలర్ రిలీజ్ అయింది.
‘కొత్త బంగారు’ లోకం సినిమాతో ప్రేమ కథాలో కొత్త లోకాన్ని చూపించి.. క్లాస్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా, బ్రహ్మోత్సవం లాంటి క్లాస్ సినిమాలు చేశాడు అడ్డాల. అయితే చివరగా వచ్చిన వెంకటేష్ ‘నారప్ప’ సినిమాతో మాస్ టచ్ ఇచ్చిన ఈ క్లాస్ డైరెక్టర్.. ఇప్పుడు తనలోని అసలైన మాస్ సంభవం చూపించబోతున్నాడు. విరాట్ కర్ణను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తు ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుక తీసుకురానున్నాడు.
పెదకాపు పార్ట్ 1 సెప్టెంబర్ 29న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూసిన తర్వాత శ్రీకాంత్ అడ్డాల తనలోని మాస్‌ను బయటకు తీసి ఊర మాస్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఒక ఊరిలోని రెండు వర్గాల మధ్య జరిగే ఊచకోతగా పెదకాపు ట్రైలర్ ఉంది. పల్లెటూళ్లలోని రాజకీయాలు, పార్టీగొడవల్ని ట్రైలర్లో చూపించారు. ఓ కొత్త హీరోకి ఇంత ఊర మాస్ సబ్జెక్ట్ అంటే రిస్క్ అనే చెప్పాలి.
కానీ ట్రైలర్లో విరాట్ కర్ణ ఓ కొత్త హీరో అని ఎక్కడా అనిపించడు. అంతేకాదు.. ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా నటిస్తున్నట్టుగా సర్ప్రైజ్ ఇచ్చాడు. ట్రైలర్ చివరలో వచ్చే డైలాగ్ చూస్తే.. శ్రీకాంత్ అడ్దాల ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అఖండ వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.. ప్రగతి హీరోయిన్గా నటిస్తోంది.