ప్రస్తుతం హరిహర వీరమల్లు వర్క్ షాప్‌తో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయగా.. అందులో పవన్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ విశేషమేంటంటే.. ఈ వర్క్‌షాప్‌లో పవన్ లుక్‌తో పాటు.. ఆయన వేసుకున్న షూస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ బూట్ల రేటు ఏకంగా 10 నుంచి 12 లక్షల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన పవన్ షూస్ గురించి కూడా అభిమానులు చర్చించుకుంటున్నారంటే.. పవర్ స్టార్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే హరిహర వీరమల్లుతో పాటు హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’.. తమిళ్ హిట్ మూవీ ‘వినోదయ సీతమ్’ రీమేక్ చిత్రాలకు కమిట్ అయ్యారు పవన్.
దాంతో ముందుగా ఈ సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ‘సాహో’ డైరెక్టర్ సుజీత్‌కు పవన్ పచ్చ జెండా ఊపేశాడని తెలుస్తోంది. రీసెంట్గా సుజీత్ ఓ కథను వినిపించగా.. పవన్‌కు బాగా నచ్చిందట. దాంతో అక్టోబర్ 5న.. దసరా సందర్భంగా ఈ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా అనే సందేహాలు రాక మానదు. ఎందుకంటే ఇప్పటికే హరీష్ శంకర్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడు. కాబట్టి సుజీత్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేం.