రీ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఇప్పటి వరకు వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. రెండే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మిగతా సినిమాలు మాత్రం కాస్త డైలమాలో ఉన్నాయి. వాటిలో తాజాగా సురేందర్ రెడ్డి సినిమా పై ఓ క్లారిటీ వచ్చినట్టైంది.సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. సినీ సెలబ్రిటీస్.. స్టార్ హీరోలు.. కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై ట్వీట్ల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, మహేష్ బాబు, రవితేజ, సాయి ధరమ్, బండ్ల గణేష్.. ఇలా చాలామంది పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానులు కూడా తమ అభిమానాన్ని చాటుకునేలా సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు. దాంతో #HBDPawanKalyan #HBDJanaSenani అనే హ్యాష్ ట్యాగ్లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇక పవన్ కమిట్ అయిన దర్శకుల్లో హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే హరీష్ శంకర్ సినిమా పై అప్పుడప్పుడు వార్తలు వచ్చినా.. సురేందర్ రెడ్డితో అసలు సినిమా ఉంటుందా అనే సందేహాలు వెలువడ్డాయి. కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని.. ‘ఏజెంట్’ మూవీ పూర్తి చేశాక స్టార్ట్ అవుతుందని.. నిర్మాత రామ్ తళ్లూరి క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ సినిమా కూడా పవన్ లైన్లో ఉన్నట్టేనని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం హరిహర వీరమల్లులో నటిస్తున్న పవన్.. వినోదయ సీతమ్ అనే తమిళ్ మూవీ రీమేక్‌లో కూడా నటించనున్నాడు. త్వరలోనే హరిహర వీరమల్లు షూటింగ్లో జాయిన్ అవనున్నారు.. అలాగే రీమేక్ మూవీ కూడా షూటింగ్ స్టార్ట్ కానుంది.