ఆహా ఓటీటీలో పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ 2 షో ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ షోలో బాలకృష్ణ ఎక్కువగా పవన్ పర్సనల్, సినిమా విషయాలపైనే దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అడిగిన తర్వాత పర్సనల్ విషయాల గురించి బాలకృష్ణ అడిగారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ అంటనే మనకు గుర్తొచ్చేది మూడు పెళ్లిళ్లు.
అసలు ఈ మూడు పెళ్లిళ్ల మ్యాటర్ ఏంటి అంటూ బాలకృష్ణ అడగగా.. నేనేమీ ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు. అసలు నేను పెళ్లే చేసుకోవద్దు. బ్రహ్మచారిగా ఉండిపోవాలని అనుకున్నాను. నేనేదీ కావాలని అనుకోలేదు. అలా జరిగిపోయాయి. మొదటి పెళ్లి అలా కన్వెన్షనల్ గా ఇంట్లో వాళ్లు సంబంధం చూశారు జరిగిపోయింది. రెండో పెళ్లిలో ఏకాభిప్రాయం కుదరలేదు. విడిపోయాం. ఆ తర్వాత మూడో పెళ్లి ఏదో వ్యామోహం వల్లనే ఇంకేదో వల్లనో చేసుకోలేదు. అలా జరిగిపోయాయి. నేనేమీ ముగ్గురిని ఒకేసారి కావాలని చేసుకోలేదు. ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతనే మరొకరిని చేసుకున్నా. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నన్ను విమర్శించడానికి వాళ్లు దీన్ని ఒక ఆయుధంగా చేసుకుంటున్నారు అనిపిస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చారు.