»Rathika Rose Who Says She Is Ready To Marry That Boy
Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ తో నేను పెళ్లికి రెడీ అంటున్న రతిక
బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హౌస్ లో ఎలిమినేట్ అయ్యి మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
Pallavi Prashanth : బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హౌస్ లో ఎలిమినేట్ అయ్యి మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే రతికా రోజ్ లాంటి అందమైన అమ్మాయి అని బిగ్ బాస్ లో లో లవ్ ట్రాక్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ టీఆర్పీ పెరుగుతుందని బిగ్ బాస్ యూనిట్ భావించింది. కానీ ఆమె ఉన్నా లేకున్నా టీఆర్పీ మాత్రం ఎక్కువగానే వచ్చింది.
దానికి ప్రధాన కారణం శివాజీ, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అమర్ అన్న సంగతి విధితమే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రతిక. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రతిక పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. రతికా రోజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆమెకు ఇంటర్వ్యూవర్ నుండి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది. మీరు ఇందులో ఎవరితో డేటింగ్ చేస్తారు.. ఎవరిని చంపేస్తారు.. ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనేది ప్రశ్న.
ఆ సమయంలోనే పల్లవి ప్రశాంత్‌ను పెళ్లి చేసుకుంటానని షాకింగ్ కామెంట్ చేసింది. రతిక రోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్స్ అక్క అని పిలిచే పల్లవి ప్రశాంత్ ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఆయన అరెస్టు చేస్తే కనీసం స్పందించను కూడా లేదు. అలాంటిది ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ ప్రశాంత్ అభిమానులు రతికా పై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.