జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలోని కీలక సన్నివేశంలో NTR షర్ట్‌లెస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని ఫైట్ సీక్వెన్స్‌లు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో లాగా కాకుండా పూర్తిగా న్యూ స్టైల్‌లో ఉంటాయని టాక్. ఇక ఈ మూవీని 2026 జూన్ 25న విడుదలవుతుంది.
టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘రూబారూ’ రిలీజ్‌కు టైం ఫిక్స్ అయింది. FEB 27న సాయంత్రం 6:03 గంటలకు ఈ పాట రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక దర్శకుడు షానీల్ డియో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘చికిరి’ పాట రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 2, 2026న ‘రాయ్ రాయ్ రారా’ అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
తమిళ స్టార్ హీరో సూర్య, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పూరి మార్క్ మేనరిజమ్స్‌తో సిద్ధం చేసిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఫలితాల తర్వాత పూరి ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారట. విజయ్ సేతుపతితో పూరి చేస్తున్న సినిమా ముగిశాక ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు టాక్.
విజయ్, రష్మికల వివాహ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో ఒక్కటైన ఈ జంట, సాయంత్రం కర్ణాటకలోని ‘కొడవ’ పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకోనున్నారు. మంగళస్నానంతో వేడుక మొదలవుతుంది. కొడవ సంప్రదాయం ప్రకారం వధువు తన పైటను వెనుక నుంచి ముందుకు వేస్తుంది. ఈ వేడుకలో డ్రమ్ బీట్స్, వారియర్ నృత్యాలు, గన్ సెల్యూట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. కాగా, నూతన దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ మూవీలోని ‘ఆయా షేర్’ సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్ ఏకంగా 9 దేశాల్లో యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. భారత్, UAEలలో అగ్రస్థానంలో ఉండగా.. US, UK, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ట్రెండ్ అవుతోంది. పాటలోని ‘రా ఇంపాక్ట్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ గ్లోబల్ సెన్సేషన్‌గా మారి...
‘కోర్ట్’ సినిమా జోడీ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘బ్యాండ్ మేళం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. తాజాగా సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 28న మాస్ మహారాజా రవితేజ ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక దర్శకుడు సతీష్ జివ్వాజి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ 2026 మార్చి 19న విడుదల కాబోతుంది. తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ హక్కులు దాదాపు రూ.63 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో కన్నడ చరిత్రలోనే తమిళ మార్కెట్‌లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ఇది సరికొత్త రికార్డు సృష్టించినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా చూడకుండానే అనుమతి ఇచ్చారని మండిపడింది. కేరళ స్టోరీ-2 సినిమాపై హైకోర్టు స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ-2’ టీజర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో.. మేకర్స్ టీజర్‌ను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా చూడకుండానే అనుమతి ఇచ్చారని మండిపడింది. కేరళ స్టోరీ-2 సినిమాపై హైకోర్టు స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో రేపు విడుదల కావాల్సిన ఈ చిత్రం నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌ను కూడా వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 మార్చి 26న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా మార్చి 9 తర్వాత పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ మార్కు డైలాగులు సినిమాలో హైలైట్ కానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కుటుంబ కలహాలపై నటి హేమ మాలిని ఎట్టకేలకు స్పందించింది. నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత సన్నీ డియోల్, బాబీ డియోల్‌లతో తనకు విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తామంతా ఒకే కుటుంబంగా కలిసి ఉన్నామని స్పష్టం చేసింది. ఈ పుకార్లలో నిజం లేదని చెబుతూ వివాదాలకు చెక్ పెట్టింది.
జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ అతిథి పాత్ర చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ సన్నివేశంలో అఖిల్ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.