అసలే ఆచార్య ఫ్లాప్‌తో నిరాశగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.. అయినా కూడా ‘గాడ్ ఫాదర్’ను సరిగ్గా ప్రమోషన్స్ చేయట్లేదని.. నిన్న, మొన్నటి వరకు అభిమానుల నుంచి వినిపించిన మాట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగడంతో ‘గాడ్ ఫాదర్’ పై హైప్ కాదు.. ఒక్కసారిగా అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఒకే ఒక్క పొలిటికల్ డైలాగ్‌తో సోషల్ మీడియాను హీట్ ఎక్కించారు మెగ...
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఒక్కో జానర్‌లో తెరకెక్కుతున్నాయి. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ ‘సలార్’ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానుంది. ఇక సందీప్ రెడ్డి వంగతో కమిట్ అయిన ‘స్పిరిట్...
రాధిక, డీజే టిల్లు కాంబినేషన్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి డీజె టిల్లు సీక్వెల్‌లో రాధికను పక్కకు పెట్టేశాడట టిల్లుగాడు. దాంతో క్రేజ్ ఉన్న మరో హాట్ బ్యూటీతో రొమాన్స్ చేసి.. మ్యాజిక్ చేయాలనుకున్నాడు టిల్లుగాడు. అందుకే నేహా శెట్టికి బదులు పెళ్లి సందD ఫేం శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన లేదు.. కానీ మేకర్స్ ఈ వార్తలపై మాత్రం స్...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ అప్టేడ్.. ఇప్పుడు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇన్నాళ్లు అదిగో, ఇదిగో అని హై టెన్షన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ‘రాముడి’ లుక్ రావడానికి ఎట్టకేలకు రంగం సిద్దం అయిపోయింది. ఇప్పటికే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లోడింగ్ అంటూ.. నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు ఆదిపురుష్ టైం దాదాప...
దర్శక ధీరుడు రాజమౌళి వల్ల ఇప్పుడు హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిని తీసుకెళ్లాడు రాజమౌళి. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్థాయిని మరింత పెంచేలా హాలీవుడ్ స్టార్స్‌ను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. అందుకే అక్కడి బడా సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత మహేష్ బాబుతో ‘గ్లోబ్ ట్రాటింగ్ య...
ప్రస్తుతం మెగా పవర్ స్టార్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ నటప్రస్థానానికి 15 ఏళ్లు పూర్తి కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. 2007 సెప్టెంబర్ 28న భారీ అంచనాల మధ్య ‘చిరుత’ మూవీ రిలీజ్ అయింది. అంచనాలకు తగ్గట్టే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్...
బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో హాలీవుడ్‌ను అట్రాక్ట్ చేశాడు. అందుకే ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ స్క్రిప్టు దశలోనే ఉంది. త్వరలోనే అన్ని విషయాలు తెలియనున్నాయి. అయితే స్క్రిప్టుతో పాటు మిగతా అండర్ గ్రౌండ్ వర్క్ చేస్త...
టాలీవుడ్ డెడ్లీ కాంబినేషన్ అల్లు అర్జున్-సుకుమార్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు పుష్పరాజ్ నటనకు ఫిదా అయిపోయారు. దాంతో పుష్ప మూవీకి బ్రహ్మరథం పట్టారు. అందుకే సీక్వెల్‌ను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు లెక్కల మాస్టారు. మేకర్స్ కూడా పుష్ప మూవీ వసూళ్లు చేసిన బడ్జెట్ అంటే.. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింంచేదుకు సన...
2009లో వచ్చిన జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆడియెన్స్‌ను కొత్త ప్రపంచలోకి తీసుకెళ్లిన ఈ విజువల్ వండర్ ఎన్నో రికార్డులను సృష్టించి.. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాంతో అవతార్ 2 కనీవిని రికార్డ్స్ క్రియేట్ చేయడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. పుష్కర కాలం గడిచిపోయినా అవతార్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. కాబట్టి డిస...
ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత అన్ని భాషల సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో యశోద, ఖుషి, శాకుంతలం సినిమాలు చేస్తోంది. వీటిలో యశోద, శాకుంతలం రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇటీవలె యశోద టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు శాకుంతలం రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ‘రుద్రమదేవి’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇదే. సమంత ...
అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.. ఎన్టీఆర్ నోట వచ్చిన ఈ డైలాగ్ అప్పుడే కాదు.. ఇప్పటికీ కూడా ఓ సన్సేషనే. స్టూడెంట్ నెంబర్1 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌కు.. మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన చిత్రాల్లో ‘ఆది’దే ఫస్ట్ ప్లేస్. అలాగే మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఫస్ట్ ఫిల్మ్ కూడా ఇదే. 2002లో రిలీజ్ అయినా ‘ఆది’ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సంవత్సర...
పోయిన రెండు వారాలు మీడియం రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంది టాలీవుడ్. దాంతో థియేటర్ల వద్ద తాకిడి కాస్త తగ్గింది. ప్రస్తుతం తెలుగు నుంచి మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’.. అక్టోబర్ 5న దసరా బరిలో నిలవనున్నాయి. అయితే వారం ముందుగానే కోలీవుడ్ సినిమాలు టాలీవుడ్‌లో సందడి చేయబోతున్నాయి. అది కూడా తెలుగు బడా నిర్మాతల సమర్పణలో వస్తుండడంతో భారీ అంచనాలున్నాయి. తమ్ముడు ధన...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ ‘పుష్ప2’కు రంగం సిద్దమవుతోంది. అయితే ఈ సారి బన్నీ సొంత స్టూడియోలో పుష్పరాజ్ సెకండ్ ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియో, దగ్గుబాటి వారి రామానాయుడు.. ఘట్టమనేని వారి పద్మాలయా.. నందమూరి వారి రామకృష్ణా స్టూడియోలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే రామోజీ ఫిలిం సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన బడా హ...
టాలీవుడ్‌లో బాబాయ్-అబ్బాయ్ కాంబినేషన్ చూడ్డానికి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఏదో గెస్ట్ రోల్స్ తప్పితే.. పవన్-చరణ్.. బాలయ్య-ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. వెంకటేష్-రానా కాంబినేషన్లో సినిమాలు రాలేదు. కానీ ఇప్పుడు వెంకీ-రానా కలిసి ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దాంతో ఈ వెబ్ సిరీస్ అప్‌డేట్స్ కోసం చాలా ఆసక్త...