వివాదాస్పద నటి పూనమ్ కౌర్(Poonam Kaur).. రాహుల్ గాంధీ(Rahul gandhi) పాదయాత్రలో పాల్గొంది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ప్రస్తుతం ఆయన పర్యటన తెలంగాణలో కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు ధర్మపుర్ వద్ద యాత్ర ప్రారంభం అయింది. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. దారి పొడవునా అనేక మంది ప్రజలు తమ తమ సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు.
ఉదయం 6 నుంచి 10 వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. దారి పొడవునా అనేక మంది ప్రజలు తమ తమ సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు. సాగింది. యెనుగొండలో SVS ఆసుపత్రి సమీపంలోని గోపాల్ రెడ్డి గార్డెన్ వద్ద యాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఉదయం జరిగిన యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్, రాహుల్‌గాంధీతో పాటు కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ పూనం మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
ఖాదీ వస్త్రాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందని రాహుల్ గాంధీ పూనమ్‌కు తెలిపారు. గాంధీజీ ధరించిన వస్త్రాలు కూడా చేనేతవేనని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. చేనేత రంగ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తోందని తెలిపారు. తన తల్లి సోనియాగాంధీ కూడా చేనేత చీరని కడతారని రాహుల్ గాంధీ పూనమ్‌కు వివరించారు. మీరు మా అమ్మ సోనియాగాంధీని చెల్లెలు ప్రియాంక గాంధీను ఒకసారి కచ్చితంగా కలవండని పూనమ్‌ను రాహుల్ గాంధీ కోరారు. సోనియాగాంధీతో కలిపించే బాధ్యతను పార్టీ నాయకులకు రాహుల్ అప్పగించారు.
రాహుల్ గాంధీతో జరిగిన సంభాషణపై పూనమ్‌కౌర్ సంతోషం వ్యక్తం చేశారు. 15 నిమిషాలు రాహుల్ గాంధీతో మాట్లాడానని చేనేత కార్మికుల మహిళల సమస్యలపై చర్చించానని పూనమ్‌కౌర్ తెలిపారు. రాహుల్ గాంధీ పప్పు కాదు సమస్యలను బాగా అధ్యయనం చేసుకుంటున్నారని, వినతి పత్రాలు ఇవ్వగానే చదివిన తర్వాతే మాట్లాడుతున్నారని పూనమ్ వెల్లడించారు. త్వరలోనే సోనియాగాంధీని, ప్రియాంకను కలవాలని రాహుల్ గాంధీ కోరిన విషయాన్ని పూనమ్ కౌర్ తెలిపారు.
రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచన లేదని, సమస్యల మీద పోరాటం చేస్తున్నానని పూనమ్ కౌర్ స్పష్టం చేశారు. పద్మశాలీలు ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. మునుగోడులో చేనేతల కోసం పనిచేయని వారికి ఓటేయకండని ఓటర్లను కోరారు. అధికార పార్టీని చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేయండని కోరారు. చేనేత సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరానని పూనమ్ తెలిపారు.