దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు ఎన్టీఆర్(NTR 30). కొరటాల శివ(koratala siva)తో 30వ సినిమా చేయబోతున్న యంగ్ టైగర్.. జస్ట్ ఈ సినిమాను అనౌన్స్మెంట్కే పరిమితం చేశాడు. అదిగో, ఇదిగో అనడమే తప్పా సెట్స్ పైకి మాత్రం తీసుకెళ్లడం లేదు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో.. జూన్‌లో ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలు కానుందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. కానీ ఆచార్య ఫ్లాప్ అవడంతో.. ఎన్టీఆర్ 30 డిలే అవుతునే ఉంది. ఆచార్యకు ముందు అనుకున్న కథ కాకుండా.. కొరటాల కొత్త కథను ముందు పెట్టుకున్నాడని.. అది కూడా గరుడ పురాణం ఆధారంగా ప్లాన్ చేస్తున్నాడని ప్రచారంలో ఉంది.
అందుకే ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతోందని వినిపిస్తునే ఉంది. అయితే ఇటీవలె స్క్రిప్టు లాక్ చేసిన కొరటాల.. అతి త్వరలో షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతన్నాడని తెలుస్తోంది. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తాజాగా తిరిగి హైదరాబాద్‌కు వచ్చేసినట్టు సమాచారం. దాంతో నెక్ట్స్ కొరటాల సినిమా పై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నవంబర్ సెకండ్ వీక్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్టు టాక్. ఆ తర్వాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అతి త్వరలో ఎన్టీఆర్ 30 లాంచ్ డేట్‌ని ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమా చేయబోతున్నాడు తారక్. ఈ సినిమాను వచ్చే సమ్మర్లో మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.