లైగర్ వివాదం రోజు రోజుకి ముదురుతునే ఉంది.. ఈ సినిమా తెచ్చిన నష్టాలు, కష్టాలతో పూరి సతమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటు పూరి.. అటు డిస్ట్రీబ్యూటర్స్ అస్సలు తగ్గడం లేదు. దాంతో ‘లైగర్’ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంనే టాక్ నడుస్తోంది. లైగర్ సినిమాతో నష్టపోయిన వారికి.. ముందుగా డబ్బులు ఇస్తానని చెప్పాడట పూరి.. కాకపోతే దానికి కాస్త సమయం వావాలని అన్నాడట.
కానీ ఈ లోపే డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్లు ధర్నాకు దిగుతున్నారని తెలుసుకున్న పూరి.. ఓ ఆడియో క్లిప్‌తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో గొడవ మరింత ముదిరింది. అంతేకాదు అది కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వరంగల్ శ్రీను, పైనాన్షియర్ శోబన్ తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు పూరి. దాంతో ఆయన ఇంటి దగ్గర భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇక దీని ఎఫెక్ట్ పూరి(puri jagannath) పై గట్టిగానే పడేలా ఉందటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
ఎట్టి పరిస్థితుల్లోను పూరి డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడని ఓ వర్గానికి చెందిన ఫైనాన్షియర్లంతా కలిసి.. ఇక పై పూరి సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదనే ఆలోచనలో ఉన్నారట. డిస్ట్రిబ్యూటర్స్ సైతం పూరిని బాయ్‌కాట్ చేయాలన్నకుంటున్నారట. ఇదే జరిగితే పూరి సినిమాలకు బడ్జెట్ కష్టాలు తప్పవని అంటున్నారు. కానీ పూరి మాత్రం బాలీవుడ్లో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి అప్ కమింగ్ సినిమాకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండదని చెప్పొచ్చు. అయినా పూరి ఇదంతా తెలియకుండానే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడా.. అంటే ఖచ్చింతగా కాదని చెప్పలేం. ఇప్పటికైనా పూరి ఈ వివదానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తే బెటర్ ఏమో.