కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ‘వారసుడు(Varasudu)’ అనే సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ నటిస్తోంది. బృందావనం స్టైల్లోనే యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక వారసుడుపై భారీ ఆశలె పెట్టుకున్నారు దళపతి అభిమానులు.
ఇటీవల వచ్చిన బీస్ట్ సినిమా నిరాశ పరచడంతో.. ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారసుడు ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో హక్కులను.. ప్రముఖ సంస్థ టి సిరీస్ సొంతం చేసుకున్నట్టు ప్రకటించారు. తెలుగు, తమిళ ఆడియో రైట్స్ కోసం ఈ సంస్థ దాదాపు 10 కోట్లు చెల్లించినట్లు సమాచారం. దాంతో తమిళంలో అత్యధిక రేటుకు అమ్ముడైన ఆల్బమ్స్‌లో టాప్-5 ‘వారిసు’ నిలిచిందని అంటున్నారు.
ఈ క్రమంలో వారసుడు ఆడియోపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు ఆడియో డీల్ జరిగిపోయింది కాబట్టి.. అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతోందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా తమిళ్ మూవీ అని దర్శకుడు చెప్పడంతో.. తెలుగులో డబ్బింగ్ మూవీగా రాబోతోందనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ విషయంలో దిల్ రాజు కాస్త ఫైర్ అయినట్టు టాక్.