డెడ్లీ కాంబినేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. దీంతో అంతకుమించి అనేలా ఈ సినిమా బిజినెస్ జరుగుతోంది. ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయినట్టుగా చెబుతున్నారు.
Pushpa 2: ఈ ఏడాదిలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీలో ఒకటైన పుష్ప 2 పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. రీసెంట్గా బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి వచ్చిన టీజర్ సెన్సేషన్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 106 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టగా, 1.5 మిలియన్స్‌కి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ టీజర్ కట్లో అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. దీంతో ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది పుష్ప2 టీజర్.
ఇక ఈ టీజర్‌కు దేవి శ్రీ ప్రసాద్ వేరే లెవెల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. గతంలో పుష్ప పార్ట్ 1 ఆల్బమ్ అదిరిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప2 ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్గా పుష్ప 2 ఆడియో రైట్స్‌ను టీ సీరీస్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పుష్ప 2 అన్ని భాషల ఆడియో రైట్స్‌ను టీ సీరీస్ అధినేత భూషణ్ కుమార్ ఏకంగా 60 కోట్లకు దక్కించుకున్నారట. ఇదే నిజమైతే.. ఆడియో రైట్స్ పరంగా పుష్ప2 సంచలనం అనే చెప్పాలి.
ఆడియో రైట్స్‌కే ఈ రేంజ్ డిమాండ్ అంటే.. పుష్ప 2 క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా థియేట్రికల్ బిజినెస్ లెక్క ఒక రేంజ్లో ఉండబోతుందని చెప్పొచ్చు. ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాలి. మరి ఫస్ట్ పార్టుతో అదిరిపోయే ఆల్బమ్ అందించిన డీఎస్పీ.. సీక్వెల్‌కు ఎలాంటి సాంగ్స్ రెడీ చేశాడనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.