పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఫహద్ ఫాజిల్. తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ ఆవేశంగా సూపర్ హిట్ కొట్టాడు. దీంతో తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవడం పక్కా అంటున్నారు.
Fahad Fazil: ఈ మధ్య మళయాళ సినిమాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి. ముందుగా మళయాళంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా కాకపోయినా తెలుగులో మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతున్నాయి. భ్రమయుగం, ప్రేమలు, గోట్ లైఫ్ మొదలుకొని లేటెస్ట్ హిట్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో మరో సినిమా వచ్చి చేరింది.
పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్‌గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఫహద్ ఫాజిల్ హీరోగా.. దర్శకుడు జీతూ మాధవన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆవేశం. ఏప్రిల్ 11న రిలీజ్ అయిన ఈ సినిమాకు సాలిడ్ పాజిటివ్ మౌత్ టాక్ వస్తోంది. ఆవేశంతో ఫహద్ ఫాజిల్ హిట్ కొట్టాడని అంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా.. ఫహద్ ఫాజిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవడం ఖాయమంటున్నారు. దీంతో తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అవడం పక్కా అంటున్నారు.
పుష్ప సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఫహద్. పైగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో పుష్ప2 ఓ రేంజ్లో సౌండ్ చేస్తోంది. కాబట్టి.. ఆవేశం తెలుగులో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటే.. మంచి లాభాలు తెచ్చిపెట్టడం గ్యారెంటీ. ఆల్రెడీ తెలుగు నిర్మాతల దృష్టి ఆవేశం సినిమా పై పడినట్టుగా చెబుతున్నారు. మరి తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారో చూడాలి.