»Rakul Preet Singh Rakuls New Business There Is No Gap Even After Marriage
Rakul Prethi Singh: రకుల్ కొత్త బిజినెస్.. పెళ్లైనా గ్యాప్ లేదుగా!
రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. కొత్తగా పెళ్లైంది కదా అని కాస్త గ్యాప్ ఇస్తుంది అనుకుంటే.. రకుల్ మాత్రం ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇంతకీ రకుల్ కొత్త బిజినెస్ ఏంటీ?
Rakul Prethi Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలె ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి ఏడడుగులు వేసింది. గోవాలో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు రకుల్, జాకీ. ఇక పెళ్లైంది కదా అని హనీమూన్‌తోనే బిజీగా ఉండలేకపోయారు ఈ కొత్త జంట. వెంటనే తమ తమ సినిమా పనులతో బిజీ అయిపోయారు. అంతేకాదు.. రకుల్ మరో కొత్త బిజినెస్ కూడా ప్లాన్ చేస్తోంది. మామూలుగా అయితే రకుల్ ఫిట్ నెస్‌కి కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. అమ్మడికి కొన్ని చోట్ల జిమ్స్ కూడా ఉన్నాయి.
హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల్లో ఎఫ్ 45 పేరుతో రకుల్‌కి కొన్ని ఫిట్నెస్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే.. వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ రకుల్ ప్రీత్ పెట్టుబడులు పెట్టింది. హెల్త్ అండ్ స్కిన్ రంగంలో కూడా అడుగుపెట్టింది. 2019లో ‘న్యూబూ’ పేరుతో బయోడీగ్రేడబుల్, రీ యూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టబోతుంది అమ్మడు. లేటెస్ట్గా ఫుడ్ బిజినెస్ స్టార్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
హైదరాబాద్‌లో ఆరంభం పేరుతో ఓ రెస్టారెంట్ ప్లాన్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. ఇందులో మిల్లెట్స్‌తో తయారు చేసిన పుడ్ లభించనుంది. దీంతో.. అమ్మడు సినిమాలతో పాటు బిజినెస్ పరంగా ఓ రేంజ్లో దూసుకుపోతుందనే చెప్పాలి. అయితే.. రకుల్ చేతిలో తమిళ్, హిందీ సినిమాలున్నాయి కానీ.. ప్రస్తుతానికి ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. కానీ బిజినెస్ పరంగా మాత్రం తగ్గేదేలే అంటోంది రకుల్.