చిరు, బాలయ్య మధ్య సంక్రాంతి వార్ నువ్వా నేనా అన్నట్టుగా జరిగింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో పాటు వారసుడు, తెగింపు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కాకపోతే సంక్రాంతి విన్నర్‌గా తెలుగులో వాల్తేరు వీరయ్య నిలిచాడు. ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాడు మెగాస్టార్. ఇక ఈ సినిమాల థియేటర్ రన్నింగ్.. దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే. దాంతో ఓటిటిలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే థియేటర్లలో లాగే.. ఓటిటిలోను వీరయ్య, వీరసింహా కాస్త అటు ఇటుగా అలాగే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందనుకున్నారు. కానీ చిరు, తర్వాతే బాలయ్య అంటున్నారు. వీరసింహారెడ్డి ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. ఫిబ్రవరి 21 నుంచే వీరసింహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఇక వాల్తేరు వీరయ్య డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా మాత్రం ఫిబ్రవరి 10 నుంచే ఓటిటిలోకి రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక ‘వారిసు’ సైతం డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దాంతో ఫిబ్రవరి 22 నుంచి ప్రైమ్ అందుబాటులోకి రానుందని అంటున్నారు. అయితే ఈ సినిమాల కంటే ముందే.. అజిత్ ‘తునివు’ ఫిబ్రవరి 8 నుంచి.. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్. అతి త్వరలోనే ఈ సినిమా డిజిటల్ వెర్షన్ రిలీజ్ గురించి క్లారిటీ రానుంది. మరి ఓటిటిలో ఈ సినిమాలు ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాయో చూడాలి.