VZM: ఆర్మ్డ్ రిజర్వు డీఎస్పీగా ఈ.కోటి రెడ్డి ఆర్మ్డ్ రిజర్వు కార్యాలయంలో ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఆర్మ్డ్ రిజర్వు పోలీసు విభాగంలో పని చేస్తున్న పలువురు పోలీస్ అధికారులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వరరావు, అదనపు ఎస్పీ పి.సౌమ్యలతలను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.