మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’.. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ని అందుకోని దుమ్ములేపింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో140 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. ఈ లెక్కన వీరయ్య భారీ లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు. ఇక యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు అమెరికాలో వాల్తేరు వీరయ్య ప్యూర్ డామినేషన్ కొనసాగుతోందని ప్రకటించారు. Pure domination of Veerayya at USA Box Office.. MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya enters the elite 2 Million Dollars club.. అంటూ ట్వీట్ చేశారు. జస్ట్ 6 రోజుల్లోనే 2 మిలియన్ క్లాబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు వాల్తేరు వీరయ్య. దాంతో మెగాస్టార్ కెరీర్లో ఇదో ఫాస్టెస్ట్ రికార్డ్ అని అంటున్నారు. అంతేకాదు.. అక్కడ మెగా హీరోలందరినీ దాటేసినట్టేనని అంటున్నారు. ఇక వీరసింహారెడ్డి యూస్ బాక్సాఫీస్ వద్ద.. ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసేసింది. కానీ వాల్తేరు వీరయ్యతో పోలిస్తే రేసులో వెనకబడిపోయింది. ఈ నేపథ్యంలో.. సంక్రాంతి విన్నర్ మెగాస్టారేనని అంటున్నారు ఫ్యాన్స్. ఇకపోతే.. ఈ సినిమాకు మాస్ మహారాజా రవితేజ చాలా ప్లస్ అయ్యాడని అంటున్నారు. అసలు రవితేజ లేకుండా వీరయ్య సక్సెస్ లేదంటున్నారు. చిరంజీవి కూడా ఆ పాత్రలో రవితేజను తప్ప మరొకరిని ఊహంచుకోలేం అని చెప్పారు. మొత్తంగా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది.