ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న సీక్వెల్ సినిమాల్లో.. బింబిసార 2(Bimbisara 2) కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. నందమూరి కళ్యాణ్(kalyan ram) రామ్ హీరోగా నటించిన ఫిక్షనల్ సోసియో ఫాంటసీ మూవీ ‘బింబిసార’.. భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట అనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తనకున్న బడ్జెట్ పరిధిలో విజువల్ పరంగా ఈ సినిమాను హ్యాండిల్ చేసిన విధానానికి ఫిదా అయ్యారు ఆడియెన్స్. దాంతో ‘బింబిసార-2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే సీక్వెల్స్ ప్రకటించాడు కళ్యాణ్. పైగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏదో ఒక పార్ట్‌లో ఉంటాడని చెప్పడంతో.. సీక్వెల్ అప్టేట్ కోసం మరింత ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో.. ‘బింబిసార 2’ గురించి పలు విషయాలు పంచుకున్నాడు వశిష్ట.
కళ్యాణ్ రామ్ కమిటైన మిగతా ప్రాజెక్ట్స్ పూర్తైన తర్వాత బింబిసార2ను మొదలు పెట్టబోతున్నట్టు.. నెక్ట్స్ ఇయర్ జూన్-జూలై నాటికి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలిపాడు. అలాగే బింబిసారపై పెరిగిన అంచనాలకు తగట్టు.. పార్ట్-2 ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తనపై మరింత ఒత్తిడి ఉంటుందని అన్నాడు. దాంతో బింబిసార 2 ఖచ్చితంగా భారీ బడ్జెట్‌తో మరింత విజువల్ వండర్‌గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.